: ఎన్టీఆర్ కు భారతరత్న ఇప్పించండి: చంద్రబాబుకు లక్ష్మీపార్వతి సూచన


దివంగత నేత నందమూరి తారక రామారావుకు భారతరత్న అవార్డు ఇప్పించాలని ఆయన సతీమణి, వైకాపా నేత లక్ష్మీపార్వతి కోరారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీ వచ్చిన ఆమె, కేంద్రంతో మాట్లాడి ఎన్టీఆర్ కు భారతరత్న వచ్చేలా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కృషి చేయాలని డిమాండ్ చేశారు. కొత్త రాజధానికి, అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెట్టాలని ఆమె ప్రతిపాదించారు. ఎన్టీఆర్ కు భారతరత్న రాకుండా గతంలో చంద్రబాబునాయుడే అడ్డుకున్నారని ఆమె ఆరోపించారు. ప్రస్తుతం తనకు అనుకూలమైన ప్రభుత్వమే కేంద్రంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడైనా చంద్రబాబు, ఎన్టీఆర్ కు భారతరత్నను ఇప్పించాలని ఆమె డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News