: జియోమీ మరో రికార్డు... 6 సెకన్లలో 50 వేల 'రెడ్ మీ నోట్' లు విక్రయం


చైనా మొబైల్ దిగ్గజం జియోమీ తన రికార్డుల పరంపరను కొనసాగిస్తోంది. మొన్నటికి మొన్న రెడ్ మీ మొబైల్ ను సెకన్ల వ్యవధిలో అమ్మేసిన ఆ కంపెనీ, తాజాగా తన రెడ్ మీ నోట్ లను కూడా అంతే వేగంగా విక్రయించేసింది. ఫ్లిప్ కార్ట్ ద్వారా విక్రయానికి పెట్టిన తన తొలి నోట్ ను భారత వినియోగదారులు కేవలం ఆరంటే ఆరు సెకన్లలో 50 వేల హ్యాండ్ సెట్ లను కొనేశారు. తన సంప్రదాయాన్ని కొనసాగించిన జియోమీ, మంగళవారం రెడ్ మీ నోట్ విక్రయాలను సరిగ్గా మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభించింది. రెడ్ మీ నోట్ విక్రయాలు ఇలా ప్రారంభమయ్యాయో లేదో కొనుగోళ్లు అలా అయిపోయాయి. ఇక ఈ దఫా అవకాశం చిక్కని వినియోగదారులు జియోమీ మలి విడత విక్రయ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.

  • Loading...

More Telugu News