: ఆసుపత్రి భవనంపై నుంచి దూకిన 'చిన్నారి ఆరాధ్య' హత్య కేసు నిందితుడు
ప్రకాశం జిల్లాలో చిన్నారి ఆరాధ్యను క్రూరంగా చంపిన కేసులో ముద్దాయిగా ఉన్న లక్ష్మీనారాయణ పోలీసుల నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించాడు. ఒంగోలులోని రిమ్స్ ఆసుపత్రి భవంతిపై నుంచి దూకి పారిపోదామని ట్రై చేసి తీవ్రగాయాలపాలయ్యాడు. రిమాండ్ ఖైదీగా ఉన్న లక్ష్మీనారాయణను వైద్య పరీక్షల కోసం నిన్న ఆసుపత్రికి తీసుకురాగా, బిల్డింగ్ పై నుంచి కిందకు దూకాడని పోలీసులు తెలిపారు. ఆ వెంటనే లక్ష్మీనారాయణను అదుపులోకి తీసుకుని ఆసుపత్రిలో చేర్చామని వివరించారు.