: గుడిసెకు నిప్పంటుకుని ఇద్దరు చిన్నారుల సజీవదహనం
హైదరాబాద్ బండ్లగూడలోని మల్లికార్జున నగర్ లో విషాదం చోటు చేసుకుంది. గుడిసెకు నిప్పంటుకుని చిన్నారులు స్వాతి, రేణుక సజీవదహనమయ్యారు. తీవ్రంగా కాలిన గాయాలతో ఉన్న తల్లిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు తండ్రిని అనుమానిస్తున్నారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.