: పెట్రోల్, డీజిల్ పై కేంద్రం నిర్ణయం దారుణం: ఒమర్ అబ్దుల్లా
పెట్రోలు, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తప్పుపట్టారు. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ వినియోగదారులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా ఎన్డీయే ప్రభుత్వం సుంకం విధించిందని ఆయన ట్వీట్ చేశారు. దేశీయ చమురు సంస్థలు పెట్రోలు, డీజిల్ పై కేవలం 91, 84 పైసల ధర తగ్గిస్తే, కేంద్రం 2.25 రూపాయలు పెంచడాన్ని ఆయన తప్పుపట్టారు.