: చర్చలు విఫలం... కొనసాగుతున్న సినిమా షూటింగుల బంద్


టాలీవుడ్ లో నిర్మాతలు, ఫిలిం ఫెడరేషన్ మధ్య చర్చలు విఫలమయ్యాయి. దీంతో వారి మధ్య వార్ మళ్లీ రాజుకుంది. గత ఐదు రోజులుగా తెలుగు సినిమాల షూటింగులన్నీ ఆగిపోయి ఇబ్బందుల్లో చిక్కుకున్నాయి. వేతన సవరణ కోసం జరుగుతున్న ఈ పోరాటంలో ఫిలిం ఫెడరేషన్, నిర్మాతల మండలి వెనకడుగు వేయడం లేదు. ఈ కేసును లేబర్ కమిషనర్ సుమోటోగా విచారణకు స్వీకరించింది. దీంతో సీసీఐ అనే కొత్త క్లాజును నిర్మాతల మండలి తెరమీదకు తెచ్చింది. దక్షిణభారత దేశంలోని ఏ ఫెడరేషన్లోనూ ఈ క్లాజు లేదని, తమకు కూడా ఆమోద యోగ్యం కాదని ఫిలిం ఫెడరేషన్ స్పష్టం చేసింది. అంతే కాకుండా ఈ క్లాజును అమలుచేస్తే తమ జీవితాలు రోడ్డున పడతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. సినీ కార్మకుల సంక్షేమం కోసం ఫెడరేషన్ చెప్పినట్టే ఇంతవరకు చేశామని, వారు చెప్పినట్టల్లా చేసుకుంటూ పోతే భారీగా నష్టపోతామని నిర్మాతలు పేర్కొంటున్నారు. దీంతో ఈ వివాదం ఎటూ తేలకుండా మిగిలిపోయింది. దీంతో షూటింగ్ లు బందయ్యాయి.

  • Loading...

More Telugu News