: విమానంలో కూడా పొగతాగాడు...బుక్కయ్యాడు!
'పొగతాగని వాడు దున్నపోతై పుట్టున్' అంటూ 'కన్యాశుల్కం'లో గిరీశం మహాశయుడు చెప్పిన సూక్ష్మాన్ని మనసా వాచా కర్మేణా నమ్మిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అబుదాబి నుంచి హైదరాబాదుకు వచ్చిన విమానంలో కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి పొగతాగాడు. ట్రైన్ లో పొగతాగితేనే ఒప్పుకోవడం లేదు. అలాంటిది విమానంలో పొగతాగితే ఒప్పుకుంటారా? దీంతో విమాన సిబ్బంది అతడిని శంషాబాద్ విమానాశ్రయ పోలీసులకు అప్పగించారు.