: 43 లక్షల ఖాతాల వివరాలు అందాయి: ప్రత్తిపాటి
ఆంధ్రప్రదేశ్ లోని రుణమాఫీకి సంబంధించి 82 లక్షల ఖాతాలకు గాను, 43 లక్షల ఖాతాల వివరాలు అందాయని, ఇంకా 39 లక్షల రైతుల వివరాలు తెలియాల్సి ఉందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రుణమాఫీపై ఈనెల 4న సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటన చేస్తారని అన్నారు. ప్రస్తుతానికి 20 శాతం నగదు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పిన ఆయన, మిగిలిన మొత్తానికి బాండ్లు జారీ చేస్తామని స్పష్టం చేశారు. బ్యాంకులకు పూర్తి వివరాలు తెలిపేందుకు రైతులకు మరింత సమయం ఇచ్చామని ఆయన వెల్లడించారు. అయితే రుణమాఫీలో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అమలుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. దీనిపై త్వరలోనే ప్రకటన చేస్తామని ఆయన చెప్పారు.