: నైజీరియాలో తెలుగు వ్యక్తి అపహరణ
నైజీరియాలో బోకోహరమ్ ఉగ్రవాదుల అరాచకాలు మితిమీరుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చింతలపూడి గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి నైజీరియాలో అపహరణకు గురయ్యాడు. శ్రీనివాస్ అపహరణకు గురైన సమాచారాన్ని అతని మిత్రుడు కుటుంబ సభ్యులకు ఫోన్ లో అందించాడు. శ్రీనివాస్ కిడ్నాప్ తో అతని తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.