: కేసీఆర్ ప్రభుత్వం ఆర్నెల్ల పాలన విశేషాలివే: పొన్నాల సెటైర్


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్నెల్ల పాలనపై టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య విరుచుకుపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం చెప్పే మాటలకు, చేతలకు పొంతన లేదని అన్నారు. కేసీఆర్ కేవలం మాటల ముఖ్యమంత్రి అని నిరూపించుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఆర్నెల్ల పాటు విద్యుత్ ను అందకుండా చేసి, ప్రజలను అంధకారంలోకి నెట్టిన కేసీఆర్ పై ప్రజల్లో వ్యతిరేకత వస్తోందని, అసలు, కేసీఆర్ ను ఎందుకు గెలిపించామా? అని తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారని అన్నారు. తెలంగాణ అమరవీరుల సంఖ్యను కూడా తెలంగాణ ప్రభుత్వం తగ్గించిందని ఆయన విమర్శించారు. కేసీఆర్ అధికారంలోకి వస్తే, ఉచితంగా విద్య అందుతుందని, ఉద్యోగాలు వస్తాయని, డబుల్ బెడ్రూం ఫ్లాట్స్ వస్తాయని తెలంగాణ ప్రజలు ఎంతో ఆశపడ్డారని అన్నారు. ఇప్పుడు, కేసీఆర్ కేవలం మాటలగారడీ చేశారన్న విషయం అర్థమై వాపోతున్నారని తెలిపారు. కేసీఆర్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని అన్నారు. పింఛనుదారులను, తెల్ల రేషన్ కార్డుదారులను తగ్గించుకోవడం తప్ప ప్రభుత్వం సాధించింది ఏమీ లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News