: మెర్సిడిస్ నుంచి చవకైన సెడాన్


వరల్డ్ క్లాస్ కార్ల తయారీదారు మెర్సిడిస్-బెంజ్ చవకైన సెడాన్ ను భారత్ మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. సీఎల్ఏ క్లాస్ లో వస్తున్న ఈ నెక్ట్స్ జనరేషన్ కారు రూ.30 లక్షల కంటే తక్కువ ధరకే లభించనుంది. ఈ కారు వచ్చే ఏడాది ఆరంభంలో భారత రోడ్లపై పరుగులు తీసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం భారత్ లో లగ్జరీ కార్ల సెగ్మెంట్ లో దూసుకుపోతున్న ఆడి ఎ-3కి ఈ సీఎల్ఏ క్లాస్ కారు గట్టిపోటీ ఇస్తుందని భావిస్తున్నారు. ఈ కారు మాడ్యులర్ ఫ్రంట్ వీల్ డ్రైవ్, 2.2 లీటర్ 4-సిలిండర్ టర్బో చార్జ్ డ్ ఇంజన్ తో డీజిల్, పెట్రోల్ వేరియంట్లలో లభిస్తుంది. 7జీ-డీసీీటీ ఆటోమేటిక్ స్పీడ్ ట్రాన్స్ మిషన్ దీని ప్రత్యేకత. ఈ కారు మార్కెట్లోకి వస్తే, బెంజి కారులో తిరగాలనుకునే ఓ మోస్తరు ధనికుల కలలు సాకారమవుతాయి.

  • Loading...

More Telugu News