: దేశీయ ఆస్తులు అమ్ముకునేందుకు సహారాకు సుప్రీం అనుమతి
దేశీయ ఆస్తులు అమ్ముకునేందుకు సహారా సంస్థకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. వినియోగదారులను మోసం చేశారని దాఖలైన కేసులో సహారా అధినేత సుబ్రతో రాయ్ గత కొంతకాలంగా తీహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వులతో సహారా ఇండియా సంస్థకు 2,710 కోట్ల రూపాయల ఆస్తులు అమ్ముకునే వెసులుబాటు లభించింది. వినియోగదారుల బకాయిలు చెల్లించే వరకు బెయిల్ కు అనుమతించే అవకాశం లేదని అత్యున్నత న్యాయస్థానం గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే.