: బైక్ ను తప్పించబోయి దగ్ధమైన బస్సు


బెంగళూరులోని రామచంద్రాపురం మెయిన్ రోడ్డుపై ప్రమాదం సంభవించింది. బెంగళూరు నుంచి వెళ్తున్న ప్రైవేటు ఏసీ బస్సు ఆర్ సీ పురం జాతీయరహదారి పైకి రాగానే ఓ బైక్ రాంగ్ రూట్ లో బస్సుకు అడ్డం వచ్చింది. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ బైక్ ను తప్పించేందుకు బ్రేక్ వేస్తూ కుడివైపుకి తిప్పాడు. ఈ క్రమంలో బస్సు డివైడర్ ను ఢీ కొట్టింది. బైక్ రోడ్డుపై పడిపోయింది. ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. ఇంతలో బస్సుకు మంటలంటుకున్నాయి. అప్రమత్తమైన డ్రైవర్ ప్రయాణికులను కిందికి దించేశాడు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికి బస్సు దగ్ధమైంది.

  • Loading...

More Telugu News