: ముందే చెప్పి ఉంటే కేసీఆర్ కూడా ఒప్పుకునేవారు: లక్ష్మీపార్వతి
శంషాబాద్ ఎయిర్ పోర్టులో డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరుపెట్టే విషయమై టీఎస్ ప్రభుత్వానికి ముందే చెప్పి ఉంటే కేసీఆర్ కూడా ఒప్పుకునే వారని వైఎస్సార్సీపీ నేత లక్ష్మీపార్వతి అన్నారు. చంద్రబాబు కావాలనే ఎన్టీఆర్ పేరును వివాదం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, కేంద్రంలో చంద్రబాబు కింగ్ మేకర్ గా ఉన్న సమయంలో ఎన్టీఆర్ కు భారతరత్న కోసం ఎందుకు ప్రయత్నించలేదని నిలదీశారు. అటు, రాజధాని నిర్మాణం కోసం వేల ఎకరాల భూమి ఎందుకని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. బాబు అనుయాయులకు కట్టబెట్టేందుకే భూసేకరణ అని ఆరోపించారు. ఈ అంశంపై కేంద్రం స్పందించాలని ఆమె డిమాండ్ చేశారు.