: వరల్డ్ కప్ కు మ్యాచ్ అఫిషియల్స్ ను ప్రకటించిన ఐసీసీ
వచ్చే ఏడాది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న వన్డే వరల్డ్ కప్ కు రిఫరీలు, అంపైర్లను ఐసీసీ మంగళవారం ప్రకటించింది. డేవిడ్ బూన్, క్రిస్ బ్రాడ్, జెఫ్ క్రో, రంజన్ మదుగళే, రోషన్ మహానామా రిఫరీలుగా వ్యవహరిస్తారు. అలీమ్ దార్, బిల్లీ బౌడెన్, బ్రూస్ ఆక్సెన్ ఫోర్డ్, ఇయాన్ గౌల్డ్, కుమార ధర్మసేన, మరాయిస్ ఎరాస్మస్, నైగెల్ లాంగ్, పాల్ రీఫెల్, రిచర్డ్ ఇల్లింగ్ వర్త్, రిచర్డ్ కెటిల్ బరో, రాడ్ టకర్, స్టీవ్ డేవిస్ అంపైర్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తారు.