: ఖరగ్ పూర్ విద్యార్థికి రూ.1.5 కోట్ల వేతన ఆఫర్
ఖరగ్ పూర్ లోని ఐఐటీలో విద్యను అభ్యసిస్తున్న ఓ విద్యార్థికి సాలీనా రూ.1.5 కోట్ల వేతనం ఇస్తామని ఓ కంపెనీ ఆఫర్ ఇచ్చింది. మొత్తం 27 కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించగా 163 మందికి అవకాశాలు లభించాయని అధికారులు తెలిపారు. ఓ భారత ఐఐటీ విద్యార్థికి లభించిన అత్యధిక వేతన ఆఫర్ ఇదే కావడం విశేషం. ఈ ఆఫర్, విదేశాలకు వెళ్లి పని చేసే ఒప్పందంపై ఆ విద్యార్థికి లభించిందని, స్వదేశం విషయానికి వస్తే ఓ విద్యార్థి రూ.42 లక్షల ప్యాకేజి అందుకున్నాడని అధికారులు వివరించారు. విద్యార్థి వివరాలు వెల్లడించేందుకు అధికారులు నిరాకరించారు.