: భారత్ ఆడే ముక్కోణపు వన్డే సిరీస్ లో మార్పులు


భారత్, ఇంగ్లండ్ జట్లతో జరగనున్న ముక్కోణపు వన్డే సిరీస్ లో స్వల్ప మార్పులు చేస్తున్నట్టు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. మారిన టెస్ట్ షెడ్యూల్ కు అనుగుణంగా, మొదటి, రెండవ వన్డే మ్యాచ్ ల తేదీలను సవరిస్తున్నట్టు తెలిపింది. సవరించిన షెడ్యూల్ ప్రకారం జవనరి 16న సిడ్నీలో జరిగే ఆరంభ మ్యాచ్ లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా తలపడతాయి. మెల్ బోర్న్ లో 18న జరగనున్న రెండో మ్యాచ్ లో ఆస్ట్రేలియా, భారత్ పోటీ పడతాయి. ఫిబ్రవరి 1న ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆరంభ మ్యాచ్ లో ఆస్ట్రేలియా, భారత్ ఆడాల్సివుంది. టెస్టు సిరీస్ ఆడిన తర్వాత భారత ఆటగాళ్లకు కాస్త విశ్రాంతి ఇవ్వాలన్న ఉద్దేశంతో వన్డే షెడ్యూల్ లో మార్పులు చేసినట్టు క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది.

  • Loading...

More Telugu News