: కింగ్ ఫిషర్ అధినేతగా మాల్యా నియామకానికి నిరాకరణ
వ్యాపార దిగ్గజం విజయ్ మాల్యాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ ఎండీగా తిరిగి మాల్యాను నియమించేందుకు ప్రభుత్వం నిరాకరించింది. ఈ మేరకు ఆయన చేసుకున్న దరఖాస్తును కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తిరస్కరించినట్టు బాంబే స్టాక్ ఎక్సేంజ్ కు కింగ్ ఫిషర్ ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ (ఎమ్ సీఎఫ్ఎల్) బోర్డు నుంచి వైదొలగాల్సి వచ్చింది. కాగా మాల్యా డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారని యూబీ గ్రూపునకు చెందిన ఎమ్ సీఎఫ్ఎల్ తెలిపింది. ఇది తక్షణం అమల్లోకి వస్తుందని వెల్లడించింది. అక్టోబరు, 2012లో తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణంగా కింగ్ ఫిషర్ కార్యకలాపాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే.