: 3 నెలల్లో రాజధాని నిర్మాణం ప్రారంభం: బాబు
మరో మూడు నెలల్లో ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మాణాన్ని అధికారికంగా ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈలోగా భూ సమీకరణ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉందని ఆయన అన్నారు. కొత్త రాజధానికి అవసరమైన భూమిని ఇచ్చేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని వివరించారు. రాజధాని నిర్మాణానికి అమెరికా డిఫెన్స్ టెక్నాలజీని ఉపయోగించుకుంటామని బాబు తెలిపారు.