: టీటీడీ బోర్డులో దర్శకేంద్రుడు!
ప్రతిష్ఠాత్మక తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు పేరు ఖరారైనట్టు తెలుస్తోంది. ఇంకా అధికారికంగా ప్రకటించని ఈ జాబితాలో సినీనటుడు, బీజేపీ నేత శివాజీ పేరును కూడా చేర్చినట్టు సమాచారం. మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి చైర్మన్‌గా వుండే బోర్డులో నెల్లిమర్ల ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి, పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, రాజమండ్రి (సిటీ) ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ (బీజేపీ), తిరుపతి బీజేపీ నేత జి.భానుప్రకాష్ రెడ్డి, సికింద్రాబాద్-కంటోన్మెంట్ ఎమ్మెల్యే జీ.సాయన్న, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తదితరుల పేర్లు ఉన్నట్టు తెలిసింది. వీరితో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి ఇద్దరు సభ్యులకు కూడా అవకాశం దక్కనుంది.