: అక్రమ కేసులకు భయపడేది లేదు: వైకాపా నేత భూమా
అధికార పార్టీ బనాయిస్తున్న అక్రమ కేసులకు భయపడేది లేదని వైకాపా సీనియర్ నేత, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి స్పష్టం చేశారు. తమకు లొంగని ప్రజా ప్రతినిధులపై రౌడీషీట్లు నమోదు చేస్తున్న చంద్రబాబు సర్కారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన మంగళవారం ధ్వజమెత్తారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎలాంటి పోరాటాలకైనా వెనుకాడేది లేదని ఆయన స్పష్టం చేశారు.