: లంబసింగిలో ఎముకలు కొరికే చలి... గజగజ వణుకుతున్న స్థానికులు


ఏపీలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతంగా లంబసింగి ప్రసిద్ధికెక్కింది. విశాఖ జిల్లాలోని ఈ మారుమూల ప్రాంతంలో గత వారం రోజులుగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం నాడు 4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా, స్థానికులు చలికి వణికిపోతున్నారు. ఇటీవలి కాలంలో ఎలక్ట్రానిక్ మీడియా పుణ్యమా అని లంబసింగి ఏజెన్సీ ప్రాంతం జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందింది. తద్వారా ఆంధ్రా కాశ్మీర్ గా వినుతికెక్కింది. దీంతో, శీతాకాలంలో ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య పెరిగింది. ఇటీవలి కాలంలో ఇక్కడ ఆపిల్ సాగుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News