: మరో మాంద్యంలోకి నెడుతున్న ఎబోలా


ప్రపంచదేశాలను వణికిస్తున్న ఎబోలా వైరస్ ప్రవేశించిన దేశాలన్నీ ఆర్థిక మాంద్యంలోకి కూరుకుపోతున్నాయి. పశ్చిమాఫ్రికాలో వ్యాపించిన ఎబోలాతో గినియా, లైబీరియా తదితర దేశాలు మాంద్యంలోకి జారుకుంటున్నాయని ప్రపంచ బ్యాంకు చెప్పింది. ఎబోలా తాకిడికి ఈ మూడు దేశాలు 2 బిలియన్ డాలర్లకు పైగా నష్టపోయాయని వివరించింది. ఈ దేశాల్లో 5 నుంచి 11 శాతం ఉన్న జీడీపీ ఇప్పుడు అర శాతం నుంచి 4 శాతానికి పరిమితమయిందని తెలిపింది. ఎబోలా మరింతగా వ్యాపిస్తే ఇంకెన్నో దేశాలు ఆర్థిక మాంద్యం ఊబిలోకి వెళ్తాయని ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది.

  • Loading...

More Telugu News