: గ్రేటర్ ను రెండు, మూడు కార్పొరేషన్లుగా విభజించండి: మర్రి శశిధర్ రెడ్డి


గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ను రెండు లేదా మూడు కార్పొరేషన్లుగా విభజించాలని మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు. నగరంలో నానాటికీ పెరుగుతున్న జనాభా దృష్ట్యా గ్రేటర్ ను విభజించే దిశగా తెలంగాణ సర్కారు చర్యలు తీసుకోవాలని ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడిన సందర్భంగా సూచించారు. జనాభా పెరిగిన నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీని కూడా మూడు కార్పొరేషన్లుగా విభజించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నగరంలోని డివిజన్ల పునర్విభజన ప్రక్రియను శాస్త్రీయంగా చేపట్టాలన్నారు. జీహెచ్ఎంసీ పాలకవర్గం పదవీ కాలం రేపటితో ముగియనున్న నేపథ్యంలో త్వరలో నగరంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీని విభజించాలని టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా యోచిస్తోంది. అయితే దీనిపై ప్రభుత్వానికి ఓ స్పష్టత రాలేదు. ఈ విషయం తెలిసిన అన్ని రాజకీయ పక్షాలు కూడా జీహెచ్ఎంసీ విభజనపై గళం విప్పుతున్నాయి. ఆ క్రమంలోనే మర్రి శశిధర్ రెడ్డి తన వాదనను వినిపించారు.

  • Loading...

More Telugu News