: 6న హస్తినకు కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెల 6న ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ నెల 7న జరగనున్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సులో ఆయన పాల్గొంటారు. సీఎంల సదస్సు పేరిటే హస్తిన వెళుతున్న ఆయన ఆ సమావేశం తర్వాత కూడా రెండు, మూడు రోజుల పాటు అక్కడే తిష్ట వేయనున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తలెత్తిన ఇబ్బందులను ఆయన మరోమారు కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు సమాయత్తమవుతున్నట్లు సమాచారం.