: బెజవాడలో అమెరికన్ కాన్సులేట్!
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తికి అమెరికా వర్గాలు సానుకూలంగా స్పందించాయి. విజయవాడలో యూఎస్ కాన్సులేట్ ఏర్పాటు చేసేందుకు అమెరికా రాజకీయ, సైనిక వ్యవహారాల కార్యదర్శి పునీత్ తల్వార్ సంసిద్ధత వ్యక్తం చేశారు. హైదరాబాదులో నేడు సీఎం చంద్రబాబుతో తల్వార్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కాన్సులేట్ వ్యవహారంపై చర్చించారు. రాష్ట్ర విభజన అనంతర పరిస్థితులను కూడా బాబు ఆయనకు వివరించారు.