: లోక్ సభకు క్షమాపణలు చెప్పిన కేంద్ర మంత్రి సాధ్వి
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర ఫుడ్ ఫ్రాసెసింగ్ శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి మంగళవారం లోక్ సభకు క్షమాపణలు చెప్పారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆమె సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రాపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాక ముస్లింల మనోభావాలు దెబ్బతినేలా ప్రకటనలు చేశారు. మంత్రి వ్యాఖ్యలపై సర్వత్రా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో మంగళవారం సభ ప్రారంభం కాగానే ఇటు లోక్ సభతో పాటు అటు రాజ్యసభలోనూ విపక్షాలు అందోళనకు దిగాయి. తక్షణమే మంత్రి బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సిందేనని పట్టుబట్టాయి. ఈ నేపథ్యంలో ఆమె లోక్ సభలో క్షమాపణలు చెప్పారు.