: తొలి టెస్టుకు మహేంద్ర సింగ్ ధోని!


భారత్-ఆస్ట్రేలియాల మధ్య అడిలైడ్ లో తొలి టెస్టు జరిగే సమయానికి భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జట్టులో చేరే అవకాశం ఉంది. ముందుగా ఖరారు చేసిన టీమిండియా ఆటగాళ్ల జాబితా ప్రకారం తొలి టెస్టులో ధోని పేరు లేదు. చేతికి గాయం కారణంగా బ్రిస్బేన్ టెస్టు నుంచి ధోని తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఆసీస్ క్రికెటర్ ఫిల్ హ్యూస్ మరణానంతరం తొలి టెస్టు వేదిక బ్రిస్బేన్ నుంచి అడిలైడ్ కు మారింది. పాత షెడ్యూల్ ప్రకారం 4 వ తేదీ నుంచి బ్రిస్బేన్ లో తొలి టెస్టు జరగాలి. గత రెండేళ్లుగా హ్యూస్ సొంత మైదానంగా మార్చుకున్న అడిలైడ్‌లోనే సిరీస్ ప్రారంభించడం అతనికి నివాళిగా క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తోంది. ఇదిలా ఉండగా, ప్రస్తుతం మారిన షెడ్యూల్ దృష్ట్యా ధోని అడిలైడ్ టెస్టుకు హాజరైనా, బరిలో దిగే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. కాగా, ఈ నెల 5న ధోని ఆస్ట్రేలియాకు వెళ్లనున్నాడు. ఒకవేళ ధోని మ్యాచ్ ఆడితే టెస్ట్ కెప్టెన్ హోదా కోసం కోహ్లి మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

  • Loading...

More Telugu News