: పార్లమెంట్ ఆవరణలో రాహుల్ గాంధీ ధర్నా


కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పోరు బాట పట్టారు. సౌమ్యంగా ఉంటే ఓట్లు పడవనుకున్నారో, ఏమో మంగళవారం ఆయన పార్లమెంట్ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. ఎన్నికల్లో దేశ ప్రజలకు ఇచ్చిన హామీలను బీజేపీ ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆరోపిస్తూ ఆయన ఈ ధర్నాకు దిగడం విశేషం. ప్రధాని నరేంద్ర మోదీ సర్కారు నిర్లక్ష్య వైఖరిని పార్లమెంట్ లో ఎండగడతామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. పార్లమెంట్ లో కీలక అంశాలు చర్చకు వచ్చినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన ఆయన ఎలాంటి సందర్భం లేకుండానే ధర్నాకు దిగడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది.

  • Loading...

More Telugu News