: నకిలీ ఫేస్ బుక్ ఖాతాలపై పాక్ ఐఎస్ఐ ఫిర్యాదు దాఖలు


పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ, సైన్యం నకిలీ ఫేస్ బుక్ ఖాతాలపై అధికార వర్గాలకు ఫిర్యాదు చేశాయి. ఐఎస్ఐ డైరక్టర్ జనరల్ లెఫ్టినెంట్ రిజ్వాన్ అక్తర్, ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్ పేరిట ఫేస్ బుక్ లో లెక్కకు మిక్కిలి నకిలీ ఖాతాలున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐఎస్ఐ పబ్లిక్ రిలేషన్స్ డీజీ మేజర్ జనరల్ అసీం బజ్వా ఖాతా తప్ప మిగిలినవన్నీ నకిలీవేనని ఆర్మీ ప్రతినిధి తెలిపారు. దీనిపై, పాకిస్థాన్ టెలీకమ్యూనికేషన్ అథారిటీ (పీటీఏ) ప్రతినిధి ఖుర్రమ్ మెహ్రాన్ స్పందిస్తూ, నకిలీ ఖాతాల విషయమై ఐఎస్ఐ సాధారణ ఫిర్యాదు దాఖలు చేసిందని చెప్పారు. తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ నకిలీ ఖాతాల ఫ్రెండ్స్ లిస్టులో జర్నలిస్టులు, రాజకీయనేతలు, వ్యాపారవేత్తలు, సైనిక సిబ్బంది, ఆఖరికి విద్యార్థులు కూడా ఉన్నారని మరో అధికారి తెలిపారు.

  • Loading...

More Telugu News