: కలికిరి ఎంపీడీఓపై మాజీ సీఎం కిరణ్ వర్గీయుల దౌర్జన్యం
ఉమ్మడి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి వర్గీయులు మంగళవారం చిత్తూరు జిల్లాలోని ఆయన సొంత మండలం కలికిరిలో దౌర్జన్యానికి పాల్పడ్డారు. కలికిరి ఎంపీడీఓగా పనిచేస్తున్న రాజశేఖరరెడ్డి తమకు అనుకూలంగా వ్యవహరించడం లేదని ఓ ఉద్యోగి కిరణ్ కుమార్ రెడ్డి వర్గీయులకు ఫిర్యాదు చేశారు. దీంతో మంగళవారం ఉదయం ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లిన కిరణ్ వర్గీయులు రాజశేఖరరెడ్డిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. అయితే అందుకు ఆయన నిరాకరించారు. దీంతో ఆగ్రహావేశాలతో ఊగిపోయిన కిరణ్ వర్గీయులు రాజశేఖరరెడ్డిని బలవంతంగా గది నుంచి బయటకు లాగేసి తలుపుకు తాళం వేశారు.