: ప్రపంచంలోని బంగారంలో 11 శాతం భారత మహిళల చెంతనే
ప్రపంచం మొత్తంలో అత్యధిక బంగారం ఉన్నది భారత మహిళల వద్దనే. మొత్తం 11 శాతం బంగారం ఇండియాలోని మహిళల దగ్గర ఉందని ఐఎంఎఫ్ వెల్లడించింది. అమెరికా, స్విట్జర్లాండ్, జర్మనీ దేశాల్లో ఉన్న మొత్తం బంగారం కన్నా ఇది అధికం. మొత్తం 950 బిలియన్ డాలర్ల విలువైన బంగారం ఇండియాలో మహిళల వద్ద ఉందని గ్లోబల్ రీసెర్చ్ సంస్థ మెక్వయిర్ తెలిపింది. డబ్బు దాచుకోవాలని భావించే వారిలో 78 శాతం మంది బంగారం కొనేందుకు ఆలోచిస్తున్నారని వివరించింది.