: ఈ నెల 4న నవాజ్ షరీఫ్ తో అమెరికా విదేశాంగ మంత్రి భేటీ


పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో అమెరికా విదేశాంగ శాఖ మంత్రి జాన్ కెర్రీ భేటీ కానున్నారు. ఈ నెల 4న లండన్ లో వీరిద్దరి మధ్య సమావేశం జరగనుంది. అఫ్ఘనిస్థాన్ పై కీలక సమీక్షలో భాగంగా వీరిద్దరి మధ్య భేటీకి ఇరుదేశాల అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య ద్వైపాక్షిక అంశాలతో పాటు ఇరు దేశాల మధ్య నానుతున్న పలు కీలకాంశాలు కూడా చర్చకు రానున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జెన్ సకీ చెప్పారు. వారం క్రితం అమెరికాలో పర్యటించిన పాక్ ఆర్మీ చీఫ్ రాహిల్ షరీఫ్ తో సమావేశమైన కెర్రీ, వారం తిరగకుండానే ఆ దేశ ప్రధాని షరీఫ్ తో భేటీ కానుండటం గమనార్హం.

  • Loading...

More Telugu News