: ముస్లింలు, క్రైస్తవులు రాముడి బిడ్డలేనంటున్న కేంద్ర మంత్రి


కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి తీవ్ర వ్యాఖ్యలతో కలకలం రేపారు. ముస్లింలు, క్రైస్తవులు రాముడి బిడ్డలేనని, ఈ సిద్ధాంతాన్ని నమ్మనివాళ్లు దేశం విడిచి వెళ్లిపోవాలని పేర్కొన్నారు. ఢిల్లీలో సోమవారం నాడు మాట్లాడుతూ, బీజేపీకి ఎందుకు ఓటు వేయాలో వివరిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సిద్ధాంతాన్ని విశ్వసించని వాళ్లు భారతదేశానికి చెందిన వాళ్లు కారని అన్నారు. రాముడి విశ్వాసులకు ఓటేస్తారో, అవిశ్వాసులకు ఓటేస్తారే మీరే తేల్చుకోవాలంటూ ప్రజలను డైలమాలో పడేశారు. తాను వేర్పాటువాదులు, జాతి వ్యతిరేక శక్తులను లక్ష్యంగా చేసుకునే ఈ వ్యాఖ్యలు చేశానని వివరణ ఇచ్చారు. భారతీయులను విదేశాల్లో 'హిందూస్థానీ'లనే అంటారని సాధ్వి తెలిపారు.

  • Loading...

More Telugu News