: ఫ్లిప్ కార్ట్ లో జియోమీ 'రెడ్ మీ నోట్' ప్రత్యేక అమ్మకాలు... ధర రూ.8,999


అందుబాటు ధరలో అన్ని స్మార్ట్ ఫోన్ ఫీచర్లనూ అందించేలా జియోమీ తయారు చేసిన 'రెడ్ మీ నోట్' అమ్మకాలు ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్ లో నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. మొత్తం 50 వేల యూనిట్లను అందుబాటులో ఉంచుతామని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. 1.7 జీహెచ్ ఆక్టా కోర్ ప్రాసెసర్, 8 జీబీ ఇంటర్నల్ మెమొరీ, 3100 ఎంఏహెచ్ బ్యాటరీతో లభించే ఫోన్ ధర రూ.8,999 అని తెలిపింది. ఆండ్రాయిడ్ జెల్లీ బీన్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా పనిచేసే ఫోన్ లో 13 ఎంపీ రేర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉన్నాయని వివరించింది. మధ్యాహ్నం 2 గంటలకు అమ్మకాలు ప్రారంభిస్తామని తెలిపింది.

  • Loading...

More Telugu News