: పోలీసు అధికారి బంధువు ఇంట్లో అస్థిపంజరం
రంగారెడ్డి జిల్లా మేడిపల్లిలోని హిమానగర్ లో ఉన్న ఓ ఇంట్లో మహిళ అస్థిపంజరం బయపడింది. కొద్ది రోజుల క్రితం ఈ మహిళను హత్య చేసి ఇంట్లోనే గొయ్యి తీసి పాతిపెట్టారని అనుమానిస్తున్నారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ దారుణం కలకలం రేపుతోంది. అస్థిపంజరం బయట పడిన ఇల్లు ఓ డీఎస్పీ బంధువులది కావడం గమనార్హం. ఘటనకు సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.