: ఇసుక లారీ దూసుకెళ్లడంతో ఉప సర్పంచి మృతి


అదుపుతప్పిన ఓ ఇసుక లారీ రోడ్డు పక్కన నిల్చున్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆ గ్రామ ఉప సర్పంచి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లా అమరావతి మండలం దిడుగు గ్రామంలో చోటు చేసుకుంది. గాయపడిన వ్యక్తిని సమీప ఆసుపత్రికి తరలించారు. జరిగిన ఘటనతో ఆ గ్రామంలో విషాదం అలముకుంది.

  • Loading...

More Telugu News