: ఉగ్రవాదుల్లో చేరేందుకు వెళ్ళిన బాలిక


ఇస్లామిక్ స్టేట్ లో చేరాలని ఉత్సాహపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా అరబ్ దేశాల నుంచి వలస వచ్చిన ముస్లింల జనాభా అధికంగా ఉన్న ఫ్రాన్స్ లోని యువత ఐఎస్ పట్ల ఆకర్షణ పెంచుకుంటోంది. తాజాగా 15 సంవత్సరాల బాలిక ఐఎస్ ఉగ్రవాదుల్లో చేరిపోయింది. ఆ బాలిక తల్లిదండ్రులు స్వయంగా ఫ్రాన్స్ ప్రభుత్వాన్ని సంప్రదించి తమ కుమార్తెను సరిహద్దులు దాటనివ్వద్దని కోరినా ప్రయోజనం లేకపోయింది. తన అక్క పాస్ పోర్ట్ సహాయంతో తొలుత ఇస్తాంబుల్ కు, అక్కడి నుంచి సిరియాకు ఆమె వెళ్లినట్టు విమానాశ్రయాల్లోని నిఘా కెమెరాల ద్వారా తెలిసింది. తను నిత్యం జిహాదీ వెబ్ సైట్ లను చూస్తూ ఉండేదని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. పేదరికం కారణంగానే ఆ బాలిక ఐఎస్ కు దగ్గరయిందని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News