: దిగొచ్చిన శివసేన... ఫడ్నవీస్ సర్కారులో చేరేందుకు అంగీకారం!
నిన్నటిదాకా బెట్టు చేసిన శివసేన ఎట్టకేలకు దిగి రాక తప్పలేదు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, హోం మంత్రిత్వ శాఖలను కేటాయించాలని డిమాండ్ చేస్తూ మొండికేసిన శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే సోమవారం ఫడ్నవీస్ తో కలిసి పనిచేసేందుకు అంగీకరించారు. డిప్యూటీ సీఎం, హోం శాఖలు లేకుండానే ఫడ్నవీస్ సర్కారులో చేరేందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. నెలపాటు బీజేపీని సతాయిస్తూ, తాను విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటూ వచ్చిన ఉధ్ధవ్, చివరకు ఫడ్నవీస్ తో కలిసి సాగేందుకే నిర్ణయించుకున్నారు. అయితే ఉధ్ధవ్ థాకరే మారేందుకు ఏ శక్తులు పనిచేశాయన్నది మాత్రం తెలియరాలేదు.