: రూ. 24 వేల కోట్ల ప్యాకేజీ ఇవ్వండి: ప్రణాళికా సంఘానికి ఏపీ విజ్ఞప్తి


ఈ రోజు ఢిల్లీలోని ప్రణాళికా సంఘం కార్యాలయంలో 'ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ' కల్పనపై సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ సమావేశంలో ఓ ప్రజెంటేషన్ ఇవ్వడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఏపీలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం రూ. 24 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని కోరనుంది. ఈ సమావేశానికి ఏపీ ప్రభుత్వం తరపున రాష్ట్ర ప్రణాళికా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.పి.టక్కర్, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి ఏపీ పునేట, పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి మన్మోహన్ సింగ్ హాజరవుతున్నారు.

  • Loading...

More Telugu News