: మరో 4 దేశాల్లో పర్యటించనున్న చంద్రబాబు
నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం, రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఆయన సింగపూర్, జపాన్ దేశాల్లో పర్యటించారు. వచ్చే ఏడాది మరో నాలుగు దేశాల్లో పర్యటించాలని ఆయన నిర్ణయించారు. జనవరి 21 నుంచి 24 వరకు స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సుకు ఆయన హాజరవుతారు. అనంతరం దక్షిణ కొరియా వెళ్లే ఆలోచనలో ఉన్నారు. ఆ తర్వాత జర్మనీ, చివరగా అమెరికా వెళ్లాలని చంద్రబాబు భావిస్తున్నారు. రాష్ట్రంలో పరిపాలనకు అంతరాయం కలగకుండా మూడు లేదా నాలుగు నెలలకు ఒక పర్యటన ఉండేలా ఆయన ప్లాన్ చేసుకుంటున్నారు.