: నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంలో మేమూ భాగస్వాములవుతాం: నందమూరి తారకరత్న
నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంలో నందమూరి వారసుల భాగస్వామ్యం కూడా ఉంటుందని దివంగత నేత ఎన్టీఆర్ మనవడు, టాలీవుడ్ హీరో తారకరత్న ప్రకటించారు. సోమవారం రాత్రి గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం పెద్దపలుదేవర్లపాడులో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఎన్టీఆర్ ఆశయాల సాధన కోసం నందమూరి వంశం కృషి చేస్తుందని ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఏపీ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు, మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.