: పని చేయండి...ఏప్రిల్ వరకు బదిలీలు ఉండవు: కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలోని అధికార యంత్రాంగం పనితీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, యంత్రాంగం జాప్యం కారణంగా తెలంగాణ ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చిందని ముఖ్యమంత్రి అన్నారు. మంచి పనులు చేసినప్పటికీ లబ్దిదారుల గుర్తింపులో జరిగిన జాప్యం కారణంగా ప్రభుత్వానికి గుర్తింపు రాలేదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ సూచనలు, సలహాలకు అనుగుణంగా అధికారుల పనితీరు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఏప్రిల్ నెల వరకు బదిలీలు ఉండవని తెలిపిన ఆయన, అధికారులను పని చేయాలని సూచించారు.