: మావోల చర్య హేయమైనది: రాజ్ నాథ్ సింగ్
చత్తీస్ గఢ్ లో సీఆర్పీఎఫ్ జవాన్లపై మావోయిస్టులు దాడికి పాల్పడడాన్ని అత్యంత హేయమైన చర్యగా కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. మావోల ఘాతుకంపై చత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి, డీజీపీలతో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకున్న ఆయన, ఢిల్లీలో మాట్లాడుతూ, మావోలు పిరికి చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మావోల మెరుపుదాడి నేపథ్యంలో ఢిల్లీలోని సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులతో సీఆర్పీఎఫ్ డీజీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. వాస్తవ పరిస్థితిని సమీక్షించుకున్నారు. సుకుమా జిల్లాలోని చింతగుంఫా ప్రాంతాన్ని సీఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ హెచ్ ఎస్ సంధూ సందర్శించారు. రేపు రాజ్ నాథ్ సింగ్ సంఘటనా స్థలాన్ని సందర్శించనున్నారు.