: ఏపీకి ప్రత్యేక హోదా కల్పించండి: కింజరాపు రామ్మోహన్ నాయుడు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. లోక్ సభలో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న విధంగా 15 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా కల్పించాలని కోరారు. దీనిపై ఏపీ ముఖ్యమంత్రి కూడా కేంద్రానికి పలు మార్లు విన్నవించారని ఆయన పేర్కొన్నారు. పరిశ్రమలన్నీ హైదరాబాదులోనే ఉండిపోవడంతో ఏపీకి పరిశ్రమలు, పెట్టుబడులు రావాలంటే ప్రత్యేక హోదా కల్పించాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News