: కాంగ్రెస్ ముద్రించే పుస్తకాలకు బీజేపీ భయపడదు: వెంకయ్య నాయుడు


ఎన్నికల వేళ బీజేపీ ఇచ్చిన హామీల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సర్కారు 25 అంశాలపై వెనకడుగు వేసిందంటూ కాంగ్రెస్ ఈ రోజు ఓ బుక్ లెట్ విడుదల చేసింది. అధికారం చేపట్టాక 180 రోజుల్లో ఏమీ సాధించలేకపోయారని విమర్శించింది. దీనిపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పందించారు. కాంగ్రెస్ ముద్రించే పుస్తకాలకు బీజేపీ భయపడదన్నారు. ప్రస్తుతం వారికేం పనిలేదు కాబట్టి, ఆ పుస్తకం పనైనా సక్రమంగా చేయాలన్నారు. అయినా, ఆ బుక్ లెట్ లో అంత ఉపయోగపడే వివరాలేవీ లేవన్నారు. మీడియా దృష్టిని ఆకర్షించేందుకు కాంగ్రెస్ ఇలాంటి అనవసర పనులు చేస్తోందని వ్యాఖ్యానించారు. ప్రజలు తమ ప్రభుత్వ నిర్ణయాలను స్వాగతిస్తున్నారని, అందుకే విజయాన్ని కట్టబెట్టారని వెంకయ్య పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News