: బాబూ... ఎన్ని వేల కోట్లు పెట్టుబడులు తేగలరో స్పష్టం చేస్తారా?: వైఎస్సార్సీపీ


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్, జపాన్ నుంచి తాజా పదవీకాలంలో ఎన్ని వేల కోట్ల రూపాయలను పెట్టుబడులుగా తీసుకురాగలరో ప్రజలకు వెల్లడించాలని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి ఆదిమూలపు సురేష్ డిమాండ్ చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు తీరు కొండను తవ్వి ఎలుకను పట్టుకున్నట్టు ఉందని ఎద్దేవా చేశారు. ఎన్ని కంపెనీలను, ఎంత పెట్టుబడులను తీసుకొస్తారో అని ఆశించిన రాష్ట్ర ప్రజలకు బాబు పర్యటన నిరాశ మిగిల్చిందని అన్నారు. నమ్మకం కుదిరితేనే జపాన్ కంపెనీలు పెట్టుబడులు పెడతాయంటూ చావుకబురు చల్లగా చెప్పారని ఆయన సీఎం తీరును విమర్శించారు.

  • Loading...

More Telugu News