: భారత్-ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ షెడ్యూల్ మార్పు
ఫిల్ హ్యూస్ మరణంతో భారత్-ఆస్ట్రేలియా తొలి టెస్టు రీ షెడ్యూల్ చేసిన సంగతి తెలిసిందే. తొలి టెస్టు డిసెంబర్ 9 నుంచి ప్రారంభమవుతుందని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తెలిపింది. ఈ మేరకు మారిన షెడ్యూల్ వివరాలను మీడియాకు విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ఇలా ఉంది... తొలి టెస్టు- డిసెంబర్ 9-13 (అడిలైడ్) రెండో టెస్టు- డిసెంబర్ 17-21 (బ్రిస్బేన్) మూడో టెస్టు- డిసెంబర్ 26-30 (మెల్బోర్న్) నాలుగో టెస్టు- జనవరి 6-10 (సిడ్నీ)