: నేనెలాంటి తప్పూ చేయలేదు... విషయం తెలియగానే విచారణకు ఆదేశించా: శ్రీనివాసన్
బీసీసీఐ చీఫ్ గా తానెలాంటి తప్పూ చేయలేదని ఐసీసీ చీఫ్ శ్రీనివాసన్ సుప్రీంకోర్టుకు తెలిపారు. మ్యాచ్ ఫిక్సింగ్ అంశంపై జరుగుతున్న విచారణకు హాజరైన ఆయన తాను నిర్దోషినని, ఫిక్సింగ్ వ్యవహారానికి, తనకు సంబంధం లేదని న్యాయస్థానానికి తెలిపారు. మ్యాచ్ ఫిక్సింగ్ పై ఆరోపణలు రాగానే విచారణకు ఆదేశించానని ఆయన కోర్టుకు చెప్పారు. సాక్షాత్తూ తన అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్ ను న్యాయస్థానానికి తీసుకొచ్చిందే తానని సుప్రీంకోర్టుకు విన్నవించారు. ఫిక్సింగ్ వ్యవహారం బయటకు రాగానే తాను చట్టానికి అనుగుణంగా వ్యవహరించానని శ్రీని వివరించారు.