: ఆ ఏడు మండలాలకు ఎమ్మెల్యే ఎవరు?: ఎంపీ సీతారాం ప్రశ్న
విభజన సందర్భంగా ఏపీలో కలిపిన ఏడు మండలాలకు ఎమ్మెల్యేలు ఎవరని ఎంపీ సీతారాం నాయక్ ప్రశ్నించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఏపీలో కలిపేటప్పుడు నేతలు ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదని అన్నారు. భద్రాద్రిని తెలంగాణకు ఇచ్చిన పాలకులు ఆస్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండిపోయేలా చేశారని ఆయన ఆరోపించారు. ఇప్పుడు గిరిజనుల బాధ్యతను ఎవరు చూస్తారని ఆయన నిలదీశారు. ఎటపాక, కన్నాయగూడెం తదితర మండలాలను విలీనం చేయడం సరైన నిర్ణయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై త్వరలోనే అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఆయన పేర్కొన్నారు. దీనిపై గవర్నర్, రాష్ట్రపతి చొరవ తీసుకుని తిరిగి తెలంగాణలో కలపాలని ఆయన డిమాండ్ చేశారు.